Ammamma❤️

అమ్మమ్మ,

"కస్తూరి రంగ రంగా... నా యన్న కావేటి రంగ రంగా .."
అని చిన్నప్పుడు నువ్వు పక్కన పడుకోబెట్టుకుని పాడిన పాటలు ఇంకా చెవిలో మోగుతూనే ఉన్నాయి .

స్కూల్ నుంచి రాగానే పెరుగన్నం - ఆవకాయ్ , రాగిపిండి - బెల్లం ముద్దలు మేము ఆడుతుంటే మా వెనుక తిరిగి తిరిగి తినిపించిన సాయంత్రాలు ఇంకా మా కళ్ళల్లో మెదులుతున్నాయి .

అరుగు మీద వంట చేస్తూ నువ్వు చెప్పిన కబుర్లు కథలు, ఉద్యోగం కోసం బయట ఊరు వెళ్తున్నా అంటే నువ్వు కూర్చోబెట్టి చెప్పిన జాగ్రత్తల చిట్టా అన్నీ గుర్తొస్తున్నాయి .

మూడో క్లాస్ వరకు చదివి భగవద్గీత శ్లోకాలను అలా ఎలా అలవోకగా చెప్పేదానివో  ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యమే మాకు. తెలుగు మీద ఇష్టం , అభిమానం నీ పద్యాలు నీ పాటల వల్లనే పెరిగాయి మాకు.

 స్వార్థం లేకుంటేనే బంధాలు నిలబడతాయి
బంధాలు నిలబడితేనే బాధ్యతలు తీర్చగలం 
బాధ్యతలు తీర్చగలిగిన రోజే మనశ్శాంతి 
అని నిన్ను చూసే నేర్చుకున్నాం.

ఈరోజుకైనా మమ్మల్ని చూపించి వీరిలో ఇది మంచి విషయం అని ఎవరైనా అంటే, మా అమ్మమ్మ పెంపకం అన్న చిన్న గర్వం తో ఆనందపడిపోతాం లోలోపలే.

నీ దగ్గర మేం నేర్చుకున్న దానితో పోలిస్తే , మేము నీకు చేయగలిగింది, చేసింది చాలా తక్కువే అనిపిస్తుంది.

ఋణపడి ఉంటాం అమ్మమ్మ... 
ఈ జీవితానికీ, నువ్వు నేర్పిన  పాఠాలకీ ...

ఒకటే అడగాలనుంది..
వెళ్ళొస్తా అని చెప్పనిదే ఎవ్వర్ని బయటికి వెళ్లనివ్వని నువ్వు , అదే మాట ఈ సారి మాకెందుకు చెప్పలేకపోయావు ...!!!!


ఇట్లు,
నీ మనవరాలు

Comments

Unknown said…
అమ్మలూ.. నాకు మాటలు రావట్లేదు రా
Unknown said…
ఎప్పుడు call చేసిన ఎన్నో మంచి మాటలు చెప్పె అమమ్మని చాలా miss అవుతున్నాము..😢😭
Unknown said…
నేను typist గా ఆఫీసు లో జాయిన్ ఔతా ను అంటే వద్దు నువ్వు టీచరు కావాలని ప్రోత్సహించారు కాబట్టే నేను ఈరోజు ఇలా వున్నాను. టీచర్స్ డే రోజు నేను మా meeting lo kuda చెప్పాను.నాకు కూడా .గురువు నిన్ను ఎలా మార్చి పోగలము అక్క.🙏🙏

Popular posts from this blog

The Unfiltered

The Scars

That's How She Loves